Zomato: కస్టమర్లకు బిగ్ షాకిచ్చిన జొమాటో.. ప్లాట్‌ఫామ్‌ ఫీజు భారీగా పెంపు..!

By Margam

Published on:

Follow Us
Zomato: కస్టమర్లకు బిగ్ షాకిచ్చిన జొమాటో.. ప్లాట్‌ఫామ్‌ ఫీజు భారీగా పెంపు..!


Telegram Channel Join Now

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్(Food Delivery App) జొమాటో(Zomato) కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. పండగ సీజన్ వేళ ప్లాట్‌ఫామ్‌ ఫీజు(Platform Fee)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి కస్టమర్లు చేసే ప్రతి ఫుడ్ ఆర్డర్(Food order) పై రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు ఈ ఫీజు రూ. 7 గా ఉండేది. పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచాం. మా బిల్లులు చెల్లించేందుకు ఈ పెంచిన ఫీజలు సాయపడతాయి..” అని కంపెనీ తన యాప్ ద్వారా తెలియజేసింది. కాగా జొమాటో ఇలా ప్లాట్‌ఫామ్‌ ధరలను పెంచడం ఇదే మొదటి సారేమి కాదు. వాస్తవానికి ఈ తరహా ఫీజును జొమాటో 2023 ఆగష్టులో ప్రవేశ పెట్టింది. తొలుత దీన్ని రెండు రూపాయలతో ప్రారంభించారు. తరువాత క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో తన ప్లాట్​ఫామ్ ఫీజును 25 శాతం పెంచి రూ.5 చేసింది. మళ్లీ జులైలో రెండు రూపాయలు పెంచి రూ.7 చేసింది. తాజాగా దీన్ని రూ. 10కి పెంచింది. అలాగే ఫాస్ట్ డెలివరీ కోసం ప్రియారిటీ ఫీజు పేరుతో జొమాటో స్పెషల్ ఫీజును కూడా వసూలు చేస్తోంది. కాగా తమ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచుతున్నట్టు జొమాటో ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్(Stock market)లో రాణించాయి. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జొమాటో షేరు 2.98 శాతం పెరిగి రూ. 264 వద్ద ట్రేడవుతోంది.



Source link

Leave a Comment