వెంకటరెడ్డికి రిమాండ్
వైసీపీ ప్రభుత్వంలో గనుల, ఖనిజ, ఇసుక పాలసీల్లో కీలక పాత్ర పోషించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన… పలు రాష్ట్రాల్లో తిరుగుతూ… చివరికి దిల్లీలోని మిలటరీ కంటోన్మెంట్‌లో గత రెండున్నర నెలలు తలదాచుకున్నారని ఏసీబీకి సమాచారం అందింది. వెంకటరెడ్డి తన ఆచూకీ తెలియకుండా సిమ్ కార్డులు, ఫోన్లు స్విచాఫ్ చేసేవారని సమాచారం. ఇండియన్ కోస్ట్ గార్డు సర్వీస్ అధికారిగా పనిచేసిన ఆయన గతంలో తనకున్న పరిచయాలతో దిల్లీలోని కంటోన్మెంట్ మకాం వేశారు. వెంకటరెడ్డి, ఆయన సన్నిహితులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు, ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్నట్లు తెలిసింది.