వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తోన్నామని అన్నారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని మోదీ దృష్టి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తీసుకెళ్లాలని, ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయని, అవసరం లేకపోయినా విస్తృతపరచడం, గత పాలకుల నిర్ణయాలు, రాయబరేలిలో పరిశ్రమలు పెట్టడం, వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని విమర్శించారు. కేంద్రం సాయం చేస్తూ పరిశ్రమను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.