Telegram Channel
Join Now
UPI Payments: ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్లలో యూనిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)దే అగ్రస్థానం. నిత్యం కోట్లల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. అయితే, యూపీఐ పేమెంట్లకు లిమిట్ అనేది ఉంది. బ్యాంకులను బట్టి ఈ పరిమితి మారుతున్నా ఇప్పటి వరకు ఒకసారి గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది. అయితే, దీనిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి రూ.5 లక్షల వరకు పేమెంట్లు చేసేందుకు తగు చర్యలు చేపట్టాయి. తాజాగా అందుకు అనుమతించాయి. అయితే, అది అన్నింటికి కాకుండా కొన్ని నిర్దిష్టమైన ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ పేమెంట్లు ఉండనున్నాయి.ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్లకు సంబంధించి రూ. 5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ విధానంలో పేమెంట్లు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. సెప్టెంబర్ 15, 2024 ఆదివారం నుంచే ఈ కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. గత నెల ఆగస్టులో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. యూపీఐతో ఆదాయపు పన్ను చెల్లిపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. ఆదాయపు పన్ను చెల్లింపులతో పాటు ఆసుపత్రి బిల్లులు, విద్యా సంస్థల ఫీజులకు సంబంధించి సైతం రూ. 5 లక్షల వరకు ఒకేసారి పేమెంట్లు చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. వీటితో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ దరఖాస్తు చేసుకునేందుకు సైతం రూ. 5 లక్షలు పేమెంట్లు చేయొచ్చు. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకూ ఈ కొత్త పద్ధతి వర్తిస్తుందని ఎన్‌పీసీఐ తెలిపింది.