గత టీడీపీ ప్రభుత్వంలో 2017లో కూడా ఉండి నియోజకవర్గంలోని గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం చుట్టు వివాదం, గొడవ జరిగింది. అప్పుడు ఈ వివాదం టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు దళిత వ్యతిరేక ముద్రను తెచ్చిపెట్టింది. దళితులంతా ఏకమై నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గంలోని కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసి, వివాదానికి తెరలేపారు. దీంతో దళిత సంఘాలు, అంబేడ్కర్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాలి.