Two wheeler: గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ద్విచక్ర వాహనాల డిమాండ్

By Margam

Published on:

Follow Us
Two wheeler: గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ద్విచక్ర వాహనాల డిమాండ్


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న దేశీయ ద్విచక్ర వాహన రంగంలో క్రమంగా రికవరీ కనిపిస్తోంది. ఇప్పటికే పలు కొత్త మోడళ్లతో వాహన తయారీ కంపెనీలు పట్టణాల్లో అమ్మకాలను పెంచుకోగా, ఈ ఏడాది ప్రథమార్థంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ టూ-వీలర్ అమ్మకాలు మెరుగ్గా ఉనాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య ద్విచక్ర వాహన విభాగం మొత్తం అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే 57-60 శాతం వృద్ధి నమోదైంది. ఇది అత్యంత వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోందని ఫాడా చెబుతోంది. సానుకూల వర్షాపాతం, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం వంటి అంశాలు కూడా ఈ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల డిమాండ్ వృద్ధికి కారణమని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనుండటంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా పెరగనున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్న మూలంగా గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించవచ్చు. తద్వారా ప్రభుత్వ మూలధన వ్యయం, గ్రామీణా ఆదాయం, ఇతర పథకాల కోసం చేసే ఖర్చు పెరగవచ్చు. కాబట్టి ఎంట్రీ-లెవల్ టూ-వీలర్, స్కూటర్ల డిమాండ్‌కు ఈ పరిణామాలు ప్రయోజనం చేకూర్చనున్నాయని నిపుణులు పేర్కొన్నారు.



Source link

Leave a Comment