Telegram Channel
Join Now
‘విజయవాడ, ఏలేరు వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజీకి బోట్లు వచ్చాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి ఆందోళనలు జరుగుతుంటే.. ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసి డైవర్ట్ చేశారు. ఇక 100 రోజుల పాలనపై ప్రజలు కోపం ప్రదర్శిస్తున్న సమయంలో.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాజకీయాల కోసం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.