Telangana Rains: తెలంగాణలో 5 రోజుల పాటు వానలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

By Margam

Published on:

Follow Us
Telangana Rains: తెలంగాణలో 5 రోజుల పాటు వానలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు


Telegram Channel Join Now
Telangana Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం బలహీనపడినట్లు తెలిపింది. ఇక మరో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నెల 21 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 19 వ తేదీ నాటికి పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది.ఇక రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం.. బుధవారం బలహీనపడినట్లు తెలిపింది. రుతుపవన ద్రోణి బుధవారం.. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోందని.. సముద్ర మట్టానికి సగటు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో 154 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జానకంపేట, ఎడపల్లిలో 120 మిల్లీమీటర్లు.. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలో 137 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడినట్లు తెలిపింది.

Source link

Leave a Comment