“మా నాయకుడు చంద్రబాబుని బాలినేని దూషించారు. అధికారంపోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. బాలినేని చేసిన అక్రమాల నుంచి పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం”- ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్