TAX: TCS ఉద్యోగులకు పన్ను నోటీసులు

By Margam

Published on:

Follow Us
TAX: TCS ఉద్యోగులకు పన్ను నోటీసులు


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ TCSలో పనిచేసే అనేక మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్ నోటీసులు అందాయి. మూలాధారం వద్ద పన్ను మినహాయింపు (TDS) క్లెయిమ్‌లలో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు వచ్చినట్లు తెలుస్తుంది. ఒక మీడియాలో వచ్చిన కథనం ప్రకారం, 30,000 నుంచి 40,000 ఉద్యోగులు ఈ నోటీసులు అందుకున్నారు, కంపెనీలో వారి సీనియారిటీని బట్టి రూ. 50,000 నుంచి రూ.1 లక్ష వరకు చెల్లించాలని వాటిలో పేర్కొన్నారు.ఉద్యోగులకు రావాల్సిన రిఫండ్లు సైతం నిలిపివేసినట్లు తెలుస్తుంది. సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో TDS క్లెయిమ్‌లు సరిగ్గా అప్‌డేట్ కానందున ఈ సమస్య ఉత్పన్నమైందని నివేదించబడింది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం సెప్టెంబర్ 9న పంపబడిన ఈ నోటీసుల్లో FY24 మార్చి త్రైమాసికానికి ఉద్యోగులు చేసిన పూర్తి చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని పేర్కొంది. దీంతో ఉద్యోగులు 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను నోటీసులు అందుకున్నారు. దీనిపై స్పందించిన TCS యాజమాన్యం, తదుపరి సూచనలు అందించే వరకు ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేయవద్దని, పన్ను అధికారులకు ఈ సమస్యను తెలియజేసి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు అంతర్గతంగా తెలియజేసింది.



Source link

Leave a Comment