Tata Nexon: కిలో CNGకి 24 కి.మీ మైలేజ్.. టాటా నెక్సాన్ కొత్త కారు

By Margam

Published on:

Follow Us
Tata Nexon: కిలో CNGకి 24 కి.మీ మైలేజ్.. టాటా నెక్సాన్ కొత్త కారు


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ నుంచి పండుగలకు ముందు మరో అదిరిపోయే మోడల్ లాంచ్ అయింది. కంపెనీ తన నెక్సాన్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ‘ఐసీఎన్‌జీ(iCNG)’. ధర రూ.8.99 లక్షలు. ఈ SUV మోడల్‌లో నెక్సాన్ నుంచి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లు మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురావడంతో కంపెనీ తన నెక్సాన్‌ను అన్ని ఇంధన విభాగాల్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉండటానికి ఇతర కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ మోడల్ లేటెస్ట్ టెక్నాలజీతో అప్‌డేట్ చేసిన ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.

2024 టాటా నెక్సాన్ iCNG స్పెసిఫికేషన్స్

Nexon iCNG మోడల్ 1.2L టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 100 hp గరిష్ట పవర్‌, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దీనిలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను అమర్చారు. మైలేజ్ పరంగా కూడా కస్టమర్లకు సంతృప్తిని ఇచ్చేలా ఒక కిలో సీఎన్‌జీకి 24 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కారు బ్యాక్‌సైడ్ సామాన్లు పెట్టుకోడానికి అధిక స్పేస్‌ను ఇచ్చారు. ప్రయాణికుల భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చిన టాటా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, మరిన్నింటి బలమైన భద్రతా సదుపాయాలను అందించింది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, నావిగేషన్ డిస్‌ప్లేతో 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. కలర్ పరంగా కొత్త రెడ్ డార్క్ వేరియంట్ ప్రత్యేకంగా ఉంటుందని అధికారులు తెలిపారు.



Source link

Leave a Comment