Tariff Hike: బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు కోలుకోలేని దెబ్బ.. నెలలోనే 25 లక్షల మంది బయటికి..!

By Margam

Published on:

Follow Us
Tariff Hike: బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు కోలుకోలేని దెబ్బ.. నెలలోనే 25 లక్షల మంది బయటికి..!


Telegram Channel Join Now
Telcos Tariff Hike: గత కొంత కాలంగా ప్రతి నెలలోనూ దిగ్గజ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లు పెరగడం ఇదే సమయంలో వొడాఫోన్- ఐడియా, బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ల సంఖ్య తగ్గడం షరా మామూలుగానే ఉండేది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరగ్గా.. మిగతా సంస్థలు లక్షల సంఖ్యలో కస్టమర్లను కోల్పోవడం గమనార్హం. దీంతో కోలుకోలేని దెబ్బ పడినట్లయింది. అంతకుముందు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ సదుపాయం తీసుకురాగా.. కస్టమర్లు దీనికి అలవాటు పడిపోయారు. నెట్‌వర్క్‌లో వెనుకబడి పోయిన బీఎస్ఎన్ఎల్, వీఐ లకు షాక్ తగిలింది. దాంట్లో నుంచి కస్టమర్లు.. ఎయిర్‌టెల్, జియోలకు మారారు.

అయితే ఉన్నట్లుండి జూన్ నెలలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరల్ని భారీగా పెంచేశాయి. తొలుత రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్స్ పెంచగా.. తర్వాత వెంటనే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా కూడా ఇదే బాటలో పయనించాయి. భారీ స్థాయిలో పెరగడంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది.

ఇప్పుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జులై నెలకు సంబంధించి.. కస్టమర్ల డేటాను వెలువరించింది. ప్రైవేట్ దిగ్గజ టెలికాం కంపెనీలు పెద్ద సంఖ్యలోనే లక్షల్లో కస్టమర్లను కోల్పోయిన నేపథ్యంలో .. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ మాత్రం కస్టమర్లను భారీగా పెంచుకుంది. అంటే చాలా మంది ఇటువైపు ఆకర్షితులయ్యారన్నమాట.

టారిఫ్స్ పెంపుతో.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా ఇలా తమ యూజర్లను కోల్పోయాయి. ఈ సంవత్సరంలో జూన్‌లో టారిఫ్స్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించగా.. జులై మొదటి వారంలో అమల్లోకి వచ్చాయి. సగటున కనీసం 10 నుంచి 27 శాతం వరకు ధరల్ని పెంచాయి. ఇక ఎయిర్‌టెల్, వీఐ సంస్థలైతే ప్రారంభ ప్లాన్ ధరల్ని దాదాపు రెట్టింపు చేయడం ఆందోళన కలిగించింది. దీంతో పెద్ద దెబ్బే తగిలింది.

దీంతో జులై నెలలోనే ఎయిర్‌టెల్ తన కస్టమర్లలో ఏకంగా 17 లక్షల మంది వరకు కోల్పోయింది. జియోను 7,58,000 మంది వీడారు. వీఐ నుంచి ఏకంగా 16 లక్షల మంది కస్టమర్లు బయటికి వచ్చారు. ఈ సమయంలోనే బీఎస్ఎల్ఎల్ మాత్రం రికార్డు స్థాయిలో 29 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ మేరకు ట్రాయ్ వెల్లడించింది. ఇక దేశం మొత్తంలో టెలికాం యూజర్ల సంఖ్య కూడా తగ్గింది. జూన్‌లో ఇది 1.17 బిలియన్లుగా ఉండగా.. జులై నాటికి ఇది 1.16 బిలియన్లకు పడిపోయింది.

Source link

Leave a Comment