దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నష్టాలతో విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. గత సంవత్సరం ఆగస్టు తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగు వారలు నష్టాలతో ముగియడం ఇదే మొదటి సారి. గ్లోబల్ మార్కెట్(Global market) నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, త్రైమాసిక ఫలితాల్లో(Quarterly Results) ప్రధాన కంపెనీలు ఆకట్టుకోకపోవడం, అమెరికా ఎన్నికల(US Elections) ప్రభావం వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. సెన్సెక్స్(Sensex) ఉదయం 80,187.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో 79,137.98 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 662 పాయింట్లు నష్టపోయి 79,402 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 218.60 పాయింట్ల నష్టంతో 24,180 వద్ద ముగిసింది. దీంతో ఈ ఒక్క రోజులో రూ. 7 లక్షల కోట్లు మదుపర్ల(Investors) సంపద ఆవిరయిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.09గా ఉంది.
లాభాలో ముగిసిన షేర్లు : యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్
నష్టపోయిన షేర్లు : ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్