School Holiday: రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..!

By Margam

Published on:

Follow Us
School Holiday: రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..!



Telegram Channel Join Now
తెలంగాణలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో.. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రధాన వాగులు మహోగ్రరూపం దాల్చటంతో.. జిల్లాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. ఇక.. భారీ వర్షాలతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది. ఇక.. హైదరాబాద్ నగరంలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో.. తెలంగాణ ప్రభుత్వం రేపు (సెప్టెంబర్ 02, సోమవారం) ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సహా.. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో రేపు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అయితే.. ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. చాలా ప్రాంతాలు జగదిగ్బందమయ్యాయి. చిన్న వర్షానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యే పరిస్థితులు నగరంలో ఉన్నందున.. రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు కార్యాలయాల యాజమాన్యాలు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.భారీ వర్షాల నేపథ్యంలో.. ట్రాఫిక్‌ సమస్యతో పాటు ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని.. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయిల్ డేవిస్.. ఈ విజ్ఞప్తి చేయటం గమనార్హం. అయితే.. పోలీస్ శాఖ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఎన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చాయన్నది చూడాలి మరి.

ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలివే..

హైదరాబాద్- విజయవాడ మార్గంలో వరద నీరు రోడ్డపైకి రావటంతో.. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో.. అటుగా వెళ్లే వాహనదారులకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. విజయవాడ వెళ్లాలనుకునే వారు.. హైదరాబాద్- చౌటుప్పల్- చిట్యాల- నార్కేట్ పల్లి- నల్గొండ- మిర్యాలగూడ- పిడుగురాళ్ల- గుంటూరు మీదుగా విజయవాడ చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇక.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేవారు.. హైదరాబాద్- చౌటుప్పల్- చిట్యాల- నకిరేకల్- అరవ్ పల్లి- తుంగతుర్తి- మద్దిరాల- మర్రిపేట బంగ్లా మీదుగా ఖమ్మం చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఉద్యోగులకు సీఎం అభినందనలు..

మరోవైపు.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యుత్ పునరుద్దరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమైన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ “భారీ వర్షంలో విరిగిన చెట్టు కొమ్మల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు రాజీలేని విధి నిర్వహణకు అంకితమైన విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి నా అభినందనలు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Source link

Leave a Comment