Telegram Channel
Join Now
ఉదయభాను రాకను స్వాగతిస్తూ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఉదయభాను వైసీపీకి రాజీనామాచేసిన తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే జనసేన ముఖ‌్య నాయకులతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, వైసీపీల తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవం ఉంది.