Railway Updates: రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. పండగ సీజన్‌లో 14 ప్రత్యేక రైళ్లు.. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు

By Margam

Published on:

Follow Us
Railway Updates: రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. పండగ సీజన్‌లో 14 ప్రత్యేక రైళ్లు.. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు


Telegram Channel Join Now

విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం స్పెషల్..

విశాఖపట్నం-తిరుపతి పూజ వీక్లీ ప్రత్యేక రైలు (08583) విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరుతుంది. సెప్టెంబ‌ర్ 2 నుండి న‌వంబ‌ర్ 25 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి సోమ‌వారం రాత్రి 7 గంటలకు విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు మంగ‌ళ‌వారం ఉద‌యం 9.15 గంటలకు తిరుప‌తి చేరుకుంటుంది. తిరుపతి-విశాఖపట్నం పూజ వీక్లీ ప్రత్యేక రైలు (08584) తిరుప‌తి నుండి బ‌య‌లుదేరుతుంది. సెప్టెంబ‌ర్ 3 నుండి న‌వంబ‌ర్ 26 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి మంగ‌ళ‌వారం రాత్రి 9.55 గంటలకు తిరుప‌తి నుంచి బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు బుధ‌వారం ఉద‌యం 10.15 గంటలకు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టాపేజ్‌లు ఉన్నాయి.



Source link

Leave a Comment