ప్రమాదవశాత్తు బాణసంచా కాల్చుతుండగా ఎవరైనా గాయపడితే వారికి ఫోన్ పే అందించే బీమా అండగా ఉంటుంది. ఇందుకు ప్రీమియం కేవలం రూ.9 మాత్రమే. మీ ఫోన్లో ఉన్న ఫోన్ పే ద్వారా మీరు రూ.9 చెల్లించి ఈ బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు. బాణసంచా కాల్చుతూ గాయపడితే మీకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు కవరెజీ లభిస్తుందని ఫోన్ పే ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం రూ.9కే బీమా రక్షణ కల్పిస్తుండడం గమనార్హం. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అక్టోబర్ 25, 2024 నుంచి మొదలు కొని 10 రోజుల పాటు ఈ ఇన్సూరెన్స్ కవరేజీ లబిస్తుందని ఫోన్ పే వెల్లడించింది. ఫోన్ పే యూజర్ మాత్రమే కాకుండా భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర బీమా కవరేజీ పాలసీ కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. అక్టోబర్ 25వ తేదీ తర్వాత ఎప్పుడు పాసీ కొనుగోలు చేస్తే ఆ రోజు నుంచే బీమా కవరేజీ అనేది మొదలవుతుంది. దీపావళి పండగను దృష్టిలో పెట్టుకని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ఫోన్ పే వెల్లడించింది. ఫోన్ పేలోని ఇన్సూరెన్స్ విభాగంలోకి వెళ్లి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకుని మీ వివరాలు అందించడం ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు.