pets: పెరుగుతున్న పెంపుడు జంతువుల ఆహార దిగుమతులు

By Margam

Published on:

Follow Us
pets: పెరుగుతున్న పెంపుడు జంతువుల ఆహార దిగుమతులు


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం చాలా మంది కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటికి అవసరమయ్యే ఆహార దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, గత ఐదేళ్లలో పెంపుడు జంతువుల ఆహార దిగుమతులు ఆరు రేట్లు పెరిగాయి. డేటా ప్రకారం, 2024 మొదటి ఆరు నెలల్లో కుక్క, పిల్లి ఆహార దిగుమతులు $69.8 మిలియన్లకు చేరుకున్నాయి. ఇది కరోనాకు ముందు 2019 జనవరి-జూన్ మధ్య కాలంలో కేవలం $25.5 మిలియన్లుగా నమోదైంది. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ లభించడంతో చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపించడంతో వీటి ఆహారానికి డిమాండ్ ఏర్పడి ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరిగాయి.

దిగుమతులు కాకుండా భారత్ నుంచి ఎగుమతులు సైతం సానుకూలంగానే ఉన్నాయి. 2024 మొదటి ఆరు నెలల్లో $36.4 మిలియన్ విలువైన కుక్క, పిల్లి ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది, మహమ్మారికి ముందు $18.8 మిలియన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇక్కడి నుంచి జర్మనీ, US, UK దేశాలకు ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో జర్మనీ వాటా 27 శాతం, US 20 శాతం, UK 15 శాతంగా ఉన్నాయి.



Source link

Leave a Comment