Petrol Price: దేశంలో పెరిగిన పెట్రోల్ సేల్స్.. డీజిల్ డౌన్.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

By Margam

Published on:

Follow Us
Petrol Price: దేశంలో పెరిగిన పెట్రోల్ సేల్స్.. డీజిల్ డౌన్.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!


Telegram Channel Join Now
Petrol Price: మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పునరుత్పాదక ఇంధన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రకాల చర్యాలు చేపడుతోంది. అయితే, గత సెప్టెంబర్, 2024 నెలలో దేశంలో పెట్రోల్ సేల్స్ పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే సెప్టెంబర్ నెలలో పెట్రోల్ సేల్స్ 2.8 శాతం మేర పెరిగగా, డీజిల్ విక్రాయలు 2 శాతం మేర పడిపోయాయి. ఇది భారత ఆయిల్ డిమాండ్ తగ్గిందనేందుకు సూచికగా నిపుణులు చెబుతున్నారు. అలాగే దేశంలో ప్రధానంగా వంట కోసం ఉపయోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగం 1 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్- ఆగస్టు పీరియడ్‌లో చేసుకుంటే డీజిల్ విక్రయాలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగగా.. పెట్రోల్ విక్రాయలు 8 శాతం పెరిగాయి. ఇక ఎల్‌పీజీ సేల్స్ 7 శాతం పెరిగాయి. అయితే, సెప్టెంబర్ నెల సేల్స్ గ్రోత్ అనేది ఏప్రిల్- ఆగస్టు యావరేజ్ సేల్స్‌ కన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. కానీ, సెప్టెంబర్ నెలలో జెట్ ఫ్యూయల్ సేల్స్ మాత్రం 9.5 శాతం మేర పెరిగాయి. అందుకు బలమైన ఎయిర్ ట్రాఫిక్ ఉండడమేనని చెప్పవచ్చు. 2019 నుంచి చూసుకుంటే జెట్ ఫ్యూయల్ సీఏజీఆర్ రేటు 2 శాతంగా ఉంది. CAGR అనేది డీజిల్ విషయంలో 1.7 శాతం, ఎల్‌పీజీ 4.5 శాతం, పెట్రోల్ 5.8 శాతంగా ఉన్నాయి. వాహనాల విక్రయాలు నెమ్మదించడం, వర్షాలు, ఇతర ఇంధనాలైన విద్యుత్తు, సీఎన్‌జీ వంటి వాటికి మారడం సెప్టెంబర్ నెలలో సేల్స్ తగ్గేందుకు కారణమైమట్లు ఆయిల్ మినిస్ట్రీ పేర్కొంది.

హైదరాబాద్‌లో నేటి పెట్రోల్ ధరలు ఇవే..

హైదరాబాద్‌లో అక్టోబర్ 2వ తేదీన లీటర్ పెట్రోల్ ధర రూ. 107.39 వద్ద ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.106.82గా ఉంది. అలాగే విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 108.27 గా ఉంది. గుంటూరులో పెట్రోల్ లీటరుకు రూ. 109.49 పలుకుతోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రేటు రూ.95.63గా ఉంది. వరంగల్‌లో లీటర్ డీజిల్ రేటు రూ. 95.09గా ఉంది. విశాఖపట్నంలో డీజిల్ లీటర్ రేటు రూ. 96.16 వద్ద ఉంది. గుంటూరులో లీటర్ డీజిల్ రేటు రూ. 97.34గా ఉంది.

Source link

Leave a Comment