దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర ఎలక్ట్రిక్ వెహికల్(EV) తయారీ సంస్థ ఓలా(OLA) కొన్ని రోజుల క్రితం పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్యాటరీ సమస్యలు(Battery problems), ఆకస్మిక షట్ డౌన్(Sudden Shutdown) అవ్వడం వంటి సమస్యల కారణంగా ఓలా సర్వీస్ సెంటర్ల(Service Centers) ముందు కస్టమర్లు బారులు తీరిన ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించడానికి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సర్వీస్ సెంటర్ల కెపాసిటీని 30 శాతం మేర పెంచుతున్నట్లు సమాచారం. 50కు పైగా కొత్త సర్వీస్ సెంటర్లను, 500 మంది టెక్నీషియన్లను పెంచుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా వినియోగదారుల నుంచి ఓలా సర్వీసులపై పెద్ద మొత్తంలో కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత నెల ఓలా హైపర్ సర్వీస్ క్యాంపెయిన్(Hyper service campaign)ను సంస్థ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ లో భాగంగా డిసెంబర్ నాటికి ఓలా సర్వీస్ సెంటర్ల సంఖ్యను డబుల్ చేయాలని చూస్తున్నట్లు సంస్థ సీఈఓ భవిష్ అగార్వల్(CEO Bhavish Agarwal) పేర్కొన్నారు.