Mumbai Actress Case : ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతడిని వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు చేర్చారు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఏ2గా పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ముంబయి నటిని వేధించిన కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐను సస్పెండ్ చేసింది.