దిశ, వెబ్‌డెస్క్:టెక్ బ్రాండ్(Tech Brand) మోటరోలా(MOTO) మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను సెలెక్టెడ్ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది.ఈ ఫోన్ పేరు మోటో జీ75(MOTO G75).ఇది 8 జీబీ ర్యామ్ తో పాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్(Snapdragon 6 Gen 3 Processor) తో రన్ కానుంది.డస్ట్ లోపలికి రాకుండా ఐపీ68 రేటింగ్(IP68 Ratingను ఈ ఫోన్ లో అందించారు.ఈ కొత్త మొబైల్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాల సెటప్ తో వస్తుంది.ఇది 30వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.కాగా, మోటో జీ75 5జీ (8 GB RAM+256GB ROM) ధర 299 యూరోలుగా నిర్ణయించారు. ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.త్వరలోనే భారత్ సహా ఇతర మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది.
MOTO G75 ఫీచర్స్..
- 6.78 అంగుళాల full-HD+ హూల్ పంచ్ స్క్రీన్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేస్తుంది
- స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120HZ
- 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో విజన్ సెన్సార్ కూడా ఉన్నాయి.
- ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది
- వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ