Mothers Letter : అధిక పనిభారంతో యువ సీఏ సూసైడ్.. కంపెనీ బాస్‌కు తల్లి లేఖ

By Margam

Published on:

Follow Us
Mothers Letter : అధిక పనిభారంతో యువ సీఏ సూసైడ్.. కంపెనీ బాస్‌కు తల్లి లేఖ


Telegram Channel Join Now

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ప్రముఖ కంపెనీలో ఛార్టర్డ్ అకౌంటెంట్‌ (సీఏ)గా పనిచేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్ పెరైల్ (26) ఇటీవలే సూసైడ్ చేసుకుంది. ఆమె బలవన్మరణానికి కారణం అధిక పనిభారం. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల్లోనే సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు అన్నా సెబాస్టియన్ దారుణ స్థితిలో సూసైడ్ చేసుకోవడంపై బాధను వ్యక్తం చేస్తూ ఆమె తల్లి అనితా అగస్టిన్ నేరుగా సదరు కంపెనీ బాస్‌కు ఒక ఈమెయిల్ చేశారు.

ఉద్యోగులపై ఆ కంపెనీ అతిగా పనిభారాన్ని మోపుతోందని ఆమె మండిపడ్డారు. ఆ సంస్థ చెబుతున్న మానవీయ విలువలు.. తన కుమార్తె అనుభవించిన వాస్తవిక స్థితికి చాలా వైరుధ్యం ఉందని అనితా అగస్టిన్ పేర్కొన్నారు. తన కుమార్తె అర్థరాత్రి వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేదని ఆమె చెప్పుకొచ్చారు. తన కూతురి మరణానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చనిపోవడానికి కొన్ని వారాల ముందు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పిందంటూ అనిత వాపోయారు.



Source link

Leave a Comment