Telegram Channel
Join Now
Minister Sridhar Babu : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ఈర్ష్య ద్వేషంతో హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని… ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.