ITR filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. కేంద్రం క్లారిటీ!

By Margam

Published on:

Follow Us
ITR filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. కేంద్రం క్లారిటీ!



ఐటీఆర్ ఫైలింగ్ 2024 కోసం ‘డెడ్‌లైన్ పొడిగించారు అని సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతోంది. దాంతో ఇది నిజమే అనుకున్న చాలా మంది జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చెయ్యకపోయినా ఏమీ కాదులే అని అనుకుంటున్నారు. కానీ కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. జులై 31 వరకే ఉచితంగా ఫైలింగ్ చేసే వీలు ఉంటుందనీ, ఆ తర్వాత ఫైల్ చెయ్యాలంటే ఫైన్ పడుతుందని తెలిపింది.సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసింది. “ఐటీఆర్ ఇ-ఫైలింగ్ తేదీ పొడిగించినట్లుగా @sandeshnews క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. @IncomeTaxIndia అధికారిక వెబ్‌సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్‌డేట్‌లను మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాము” అని ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ ఇక్కడ చూడండిIt has come to our knowledge that a clipping of @sandeshnews is circulating on social media regarding extension of date of e-filing of ITR. This is FAKE news.Taxpayers are advised to follow updates from the official website/portal of @IncomeTaxIndia#FactCheck pic.twitter.com/Hs5jk0kF3J— Income Tax India (@IncomeTaxIndia) July 22, 2024ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ 2024కి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత పెనాల్టీ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జులై 31 లోపే తమ ITR ఫైల్ చేసుకోవడం మేలు. ఇలా గడువులోపు చేసేస్తే, రిఫండ్స్ కూడా త్వరగా పొందగలరు. గడువులోపు ఫైల్ చెయ్యని వారు.. చెల్లించే పన్నుపై.. సెక్షన్ 234A కింద 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటి ముందు చెప్పులు ఇలా ఉంటే అరిష్టం..!
మరిన్ని వార్తలు…ఒకవేళ గడువులోపు చెల్లించలేకపోతే, రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 ఫైన్ చెల్లించాలి. రూ.5లక్షల కంటే పైన ఆదాయం ఉన్నవారు రూ.5,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పెనాల్టీ చెల్లిస్తూ, డిసెంబర్ 31 వరకూ చెల్లించవచ్చు.తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..


Telegram Channel Join Now

Leave a Comment