IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీఓల వరద..నిన్న ఒక్కరోజే సెబీకి 13 కంపెనీలు దరఖాస్తు

By Margam

Published on:

Follow Us
IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీఓల వరద..నిన్న ఒక్కరోజే సెబీకి 13 కంపెనీలు దరఖాస్తు


Telegram Channel Join Now

దిశ, వెబ్‌డెస్క్:ఇటీవల కాలంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Stock Markets)లో ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పబ్లిక్‌ ఇష్యూల కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి.కాగా మార్కెట్ల నియంత్రణ(Markets Regulatory) సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి నిన్న ఒక్కరోజే 13 కంపెనీలు దరఖాస్తు(Application) చేసుకున్నాయి.ఇందులో తెలంగాణ(TG)లోని హైదరాబాద్(HYD) కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నడిపిస్తున్న కరీంనగర్‌(Karimnagar) గ్రానైట్‌ సంస్థ ‘మిడ్‌వెస్ట్‌(Mid West)’ సంస్థ కూడా ఉంది. కాగా..సెబీ వద్ద దాఖలు చేసిన ప్రిలిమినరీ పేపర్స్‌ వివరాల ప్రకారం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO)ల ద్వారా ఈ కంపెనీలు రూ.8,000 కోట్ల నిధులను సమీకరించే(Raising Funds) అవకాశం ఉంది.అయితే.. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో పబ్లిక్‌ ఇష్యూలకు మంచి స్పందన వస్తున్న కారణంగానే కంపెనీలు ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడానికి క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు రావడంతో మదుపర్ల(Investors)కు ఎక్కువ షేర్లు లభించే అవకాశం ఉందంటున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు.అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్న విషయమని, అన్ని తెలుసుకున్నాకే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సెబీకి దరఖాస్తు చేసుకున్నకంపెనీలు ఇవే..

  • విక్రమ్ సోలార్
  • ఆదిత్య ఇన్ఫోటెక్
  • అజాక్స్ ఇంజినీరింగ్
  • రహీ ఇన్ఫోటెక్
  • వరిందెర కన్‌స్ట్రక్షన్స్‌
  • విక్రాన్ ఇంజినీరింగ్
  • వినో కార్పోరేషన్
  • మిడ్‌వెస్ట్
  • సంభవ్ స్టీల్ ట్యూబ్స్
  • జారో ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ టెక్నాలజీస్
  • ఆల్‌టైమ్ ప్లాస్టిక్స్
  • స్కోడా ట్యూబ్స్
  • దేబ్ యాక్సలరేటర్



Source link

Leave a Comment