iPhone 16: భారత్‌లో యాపిల్ ఫోన్ల అమ్మకాలను పెంచనున్న ఐఫోన్ 16

By Margam

Published on:

Follow Us
iPhone 16: భారత్‌లో యాపిల్ ఫోన్ల అమ్మకాలను పెంచనున్న ఐఫోన్ 16


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ తాజాగా ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ భారత్‌లో యాపిల్ ఫోన్ల అమ్మకాలకు భారీ ఊతం కల్పిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 2024 చివరి నాటికి సుమారు 1.3 కోట్ల ఐఫోన్‌లను విక్రయించడానికి కంపెనీకి వీలు కల్పిస్తుందని, దీంతో యాపిల్ వాల్యూమ్ పరంగా 8 శాతం మార్కెట్ వాటాను పొందగలదని విశ్లేషకులు అంచనా వేశారు. ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఫోన్ లాంచ్ కావడం వలన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అమ్మకాల పరంగా ఐఫోన్ 16‌తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా.

ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) హెడ్ ప్రభు రామ్ మాట్లాడుతూ, ఈ కొత్త మోడల్ భారత్‌లో యాపిల్ వృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు పాత మోడల్‌ను విడిచి పెట్టి తాజా ఐఫోన్ మోడల్‌లకు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. భారతదేశంలో లాంచ్ చేసిన త్రైమాసికం కాలంలో ఐఫోన్ 15తో పోలిస్తే ఐఫోన్ 16 సిరీస్ సంవత్సరానికి 30 శాతం పెరుగుతుందని సీఎంఆర్ విశ్లేషణ పేర్కొంది.

కంపెనీ 2024లో దాదాపు 12.5-13 మిలియన్ల ఐఫోన్‌లను రవాణా చేస్తుందని అంచనా వేస్తున్నాము. అవి భారత్‌లో వాల్యూమ్ పరంగా దాదాపు 8 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని IDC ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకేందర్ సింగ్ అన్నారు. రాబోయే నెలల్లో పండుగల కోసం iPhone 14, 15, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌‌లు వంటి ఉత్పత్తులపై ధర తగ్గుదలతో పాటు, పలు ఆఫర్లు కూడా లభించనుండగా వినియోగదారుల నుంచి వీటి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సింగ్ పేర్కొన్నారు.



Source link

Leave a Comment