Inflation: నాలుగు నెలల్లో మొదటిసారిగా 2% దిగువకు టోకు ద్రవ్యోల్బణం

By Margam

Published on:

Follow Us
Inflation: నాలుగు నెలల్లో మొదటిసారిగా 2% దిగువకు టోకు ద్రవ్యోల్బణం


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: నాలుగు నెలల్లో మొదటిసారిగా ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 2 శాతం దిగువకు పడిపోయిందని మంగళవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. కమోడిటీ, ఆహార ధరలలో తగ్గుదల కారణంగా ఇది సాధ్యమైనట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17న విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశ టోకు ద్రవ్యోల్బణం జులైలో 2.04 శాతంతో పోలిస్తే ఆగస్టులో 1.31 శాతానికి తగ్గింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుత స్థాయిల వద్ద స్థిరంగా ఉంటే ఈ తగ్గుదల ధోరణి మరికొంత కాలం కొనసాగుతుందని సంబంధిత వర్గాల వారు భావిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు మూడేళ్ల కనిష్ట స్థాయి 70 డాలర్లకు చేరువలో ఉన్నాయి. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం పాటు తక్కువగా ఉన్నట్లయితే ప్రభుత్వ ఆర్థిక గణనలకు అంతరాయం కలిగించవచ్చు. మరోవైపు, వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.6 శాతం నుండి 3.65 శాతానికి కొద్దిగా పెరిగింది. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు స్వల్పంగా పెరగడం వలన ఇది కొంత పెరిగింది. అలాగే, సేవా ద్రవ్యోల్బణం పెరుగుదల కూడా దీనికి దోహదపడింది.



Source link

Leave a Comment