IMD: ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 58వ స్థానం

By Margam

Published on:

Follow Us
IMD: ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 58వ స్థానం


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండీ) వరల్డ్ ట్యాలెంట్ ర్యాంకింగ్స్-2024లో భారత్ వెనుకబడింది. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో గతేడాది కంటే రెండు స్థానాలు దిగజారి భారత్ 58వ ర్యాంకును పొందింది. అంతకుముందు 2022లో భారత్ 52వ స్థానంలో ఉంది. దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రతిభ పోటీతత్వం మరింత మెరుగవ్వాల్సి ఉందని ఐఎండీ నివేదిక అభిప్రాయపడింది. అయితే, పెట్టుబడుల వాతావారణం మరింత అభివృద్ధి చెందాల్సిన తక్షణ అవసరం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ 2024 ఏడాది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సింగపూర్, లగ్జంబర్గ్, స్వీడెన్, డెన్మార్క్, ఐలాండ్, నార్వె, నెదర్లాండ్, హాంగ్‌కాంగ్, ఆస్ట్రియా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. ఐఎండీ వరల్డ్ ట్యాలెంట్ ర్యాంకులను జీవన నాణ్యత, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక మాధ్యమిక విద్యతో సహా పలు అంశాల ఆధారంగా జాబితాను రూపొందిస్తుంది.



Source link

Leave a Comment