Telegram Channel
Join Now
తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది.. సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతోంది. నగరంలో ఇప్పటికే ఎన్నో ఫ్లై ఓవర్స్ నిర్మించగా.. ట్రాఫిక్ సమస్యలు లేకుండా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అయితే కొత్తగా అమీర్‌పేటకు కూడా కొత్త రూపు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ, ట్రాఫిక్‌క చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అమీర్‌పేటలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలతో పాటుగా రోడ్లపైకి చిరు వ్యాపారులు రావడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే అమీర్‌పేట చుట్టూ నాలుగు వైపులా కూడళ్లను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్కడ అవసరమైన వివిధ మార్పులు చేర్పులతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ, నగర ట్రాఫిక్ పోలీస్, టీజీఎస్‌ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏలోని హుమ్టాతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.అమీర్‌పేటలో చేసే మార్పులు, చేర్పుల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వర్ణజయంతి కార్యాలయం సమీపంలో ఉన్న ఒక బస్టాప్‌ను మెట్రో స్టేషన్ కిందకు మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు వెనక్కు వెళ్లి బస్సు ఎకాల్సి వస్తోంది.. అందుకే ఒక బస్‌స్టాప్‌ను మెట్రో స్టేషన్ కిందకు మార్చాలనుకుంటున్నారు. బస్టాప్‌ను మెట్రో స్టేషన్ కిందకు మారిస్తే ప్రయాణిచకులకు ఉపయోగకరంగా ఉందంటున్నారు. అంతేకాదు స్వర్ణజయంతి జంక్షన్‌లో నాలుగువైపులా వాహనాలు అడ్డదిడ్డంగా దూసుకొస్తున్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అక్కడ సారథి స్డూడియో వైపు నుంచి వచ్చే వాహనాలు ఒక పద్దతిలో వెళ్లేలా అక్కడ ఐల్యాండ్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.
అలాగే అమీర్‌పేట సత్యం థియేటర్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలకు ఫ్రీలెఫ్ట్‌తో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.. అందుకే ఇక నుంచి ఫ్రీలెఫ్ట్‌ను నియంత్రించేందుకు మ్యానువల్‌గా, లేని పక్షంలో సిగ్నల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అమీర్‌పేట వైపు నుంచి నుంచి బేగంపేట వెళ్లే మెట్రో కింద రోడ్డు కూడా కిక్కిరిసి ఉన్నాయి.. దీనికి కారణం స్థానిక వ్యాపారులు అని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అలసు నడిచే వెళ్లే వారికి ఫుట్‌పాత్ కనిపించడం లేదు. ఇక్కడి వ్యాపారులకు సత్యం థియేటర్ ముందు భాగంలో ప్రత్యామ్నాయంగా ఖాళీ స్థలం కేటాయించనున్నారు.

అమీర్‌పేటలో ఉన్న కనకదుర్గ ఆలయం జంక్షన్‌లో సిగ్నల్ వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు. అమీర్‌పేట జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉంది.. అందుకే కేఎల్‌ఎం మాల్ దగ్గర ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.పంజాగుట్ట శ్మశానం దగ్గర స్టీల్ వంతెన ఏర్పాటు చేసే ఆలోచనలలో ఉన్నారు.. ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే ఈ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం మీద అమీర్‌పేటలో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.