టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కొడుకు పుట్టిన రోజుకు స్పెషల్ విషెస్ తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోతో పాండ్య తన కొడుకుకు శుభాకాంక్షలు తెలిపాడు. కొడుకుతో అల్లరి చేసిన ఈ వీడియోలో అగస్త్య ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. ‘నా బలానికి ప్రతి రోజు మీరే మూలం. క్రైమ్‌లో నా భాగస్వామి. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నా అగు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు”. అని హార్దిక్ రాసుకొచ్చాడు.
పాండ్యా కుమారుడికి నెటిజన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. పాండ్య, నటాషా రెండేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. జూలై 30, 2020న అగస్త్య జన్మించాడు. ఇటీవలే హార్దిక్ పాండ్యా, తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు గురువారం (జూలై 18) ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ లో తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలియజేశారు. ఇది తమకు కఠినమైన నిర్ణయమని.. తన కుమారుడు అగస్త్యకు మంచి తల్లిదండ్రులుగా ఉంటామన్నాడు పాండ్య.
ప్రస్తుతం నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాలో ఉంది. కొన్ని రోజుల క్రితం అక్కడ కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హార్దిక్ పాండ్య విషయానికి వస్తే శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. వ్యక్తిగత కారణాల వలన వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.