Google Pixel 9 Pro: రేపటి నుంచే పిక్సెల్ 9 ప్రో సేల్ ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్‌ వివరాలు ఇవే..

By Margam

Published on:

Follow Us
Google Pixel 9 Pro: రేపటి నుంచే పిక్సెల్ 9 ప్రో సేల్    ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్‌ వివరాలు ఇవే..


Telegram Channel Join Now

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(US)లోని కాలిఫోర్నియాకు(California) చెందిన టెక్ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ గూగుల్(Google) ఈ ఎడాది ఆగస్టులో పిక్సెల్ 9 సిరీస్(Pixel 9 Series)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ఫోల్డ్, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఉన్నాయి. అయితే వీటిలో పిక్సెల్ 9 ప్రో మాత్రం ఇంకా ఇండియా మార్కెట్(India Market) లో లాంచ్ కాలేదు. అయితే తాజాగా పిక్సెల్ 9 ప్రో సేల్(Pixel 9 Pro Sale)ను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఇక గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర విషయానికి వస్తే 16 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900గా నిర్ణయించారు. ఈ ఫోన్ హాజెల్, పోరసెలియన్, రోజ్ క్వార్ట్జ్, అబ్సిడియన్ కలర్స్ లో లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్(Flipkart)తో పాటు ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్స్ అయిన రిలయన్స్ డిజిటల్(Reliance Digital), క్రోమా(Chroma)లో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్స్..

  • 6.3-అంగుళాల ఎల్టీఓపీ ఓఎల్ఈడీ స్క్రీన్
  • గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • 1280×2856 పిక్సల్స్ రిజల్యూషన్
  • IP68 రేటింగ్ (Dust and Water Resistant)
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం
  • బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 48 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది
  • సెల్ఫీల కోసం 42 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
  • 4700 ఎంఏహెచ్ బ్యాటరీ



Source link

Leave a Comment