GO 85 Reversion: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం, పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల మధ్య బుధవారం నాడు సచివాలయంలో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. వైద్య, ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమీషనర్ సి.హరికిరణ్, డిఎంఇ డాక్టర్ నరసింహం, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, పీహెచ్సీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ యూనిస్ తో పాటు 15 మంది డాక్టర్లు చర్చల్లో పాల్గొన్నారు.