Gen Z : మాకు మేమే బాస్.. మాకొద్దు ఈ జాబ్స్..

By Margam

Published on:

Follow Us
Gen Z : మాకు మేమే బాస్.. మాకొద్దు ఈ జాబ్స్..


Telegram Channel Join Now

దిశ, ఫీచర్స్ : డిజిటల్ అవగాహన Gen Zను తమపై తమకు మరింత నమ్మకాన్ని పెంచేస్తుంది. వ్యవస్థాపక స్ఫూర్తితో ముందుకు సాగేలా చేస్తుంది. శాంటాండర్ UK పరిశోధన ప్రకారం.. Gen Zలో మూడొంతుల మంది తమకు తాము బాస్ గా ఉండాలని కోరుకుంటున్నారు. నైన్ టు ఫైవ్ జాబ్ చేసేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. 77 శాతం మంది విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించగల సామర్థ్యంపై నమ్మకంతో ఉంటే… 39 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్ నుంచి బిజినెస్ చేయడానికి తమను తాము ప్రోత్సహించుకుంటున్నారు. ఈ విషయంలో మిలీనియల్స్ ను అధిగమిస్తున్నారు.

పోల్ చేసిన వారిలో సగం మంది Gen Z, మిలీనియల్స్ డిజిటల్ యుగంలో పెరిగినందున వ్యాపారాన్ని ప్రారంభించే విషయానికి వస్తే ప్రయోజనం ఉందని చెప్పారు. అదే Gen X, బూమర్‌లు సాంప్రదాయ విద్య, వృత్తి మార్గాన్ని అనుసరించడానికి ఎక్కువ ఒత్తిడి ఉన్నందున వారి యంగ్ ఏజ్ లో (34%) వ్యాపారాన్ని ప్రారంభించడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ఫర్మేషన్, టూల్స్, గ్లోబల్ కనెక్షన్స్ వన్ క్లిక్ దూరంలో ఉన్నందునా.. Gen Z మోస్ట్ ఎంట్రప్రెన్యూరల్ జనరేషన్ గా ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు ఇతర తరాలతో పోలిస్తే తమ ఐడియాలను రియాలిటీగా మార్చేందుకు ముందుంది.



Source link

Leave a Comment