దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొన్ని నెలలుగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్(Global Market) నుంచి నెగటివ్ సిగ్నల్స్, త్రైమాసిక ఫలితాల్లో(Quarterly Results) చాలా వరకు కంపెనీలు ఆశించినంత మేర రాణించకపోవడం వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ షేర్ల(Equity Shares)లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఈ నెల ప్రారంభం నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా షేర్లను సేల్ చేశారు. అలాగే ఎక్కువ మొత్తంలో ఫండ్స్ ను కూడా ఉపసంహరించుకున్నారు.
కాగా అక్టోబర్(October)లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 85,790 కోట్లను బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) తెలిపిన సమాచారం ప్రకారం విదేశీ మదుపర్లు అక్టోబర్ 1 నుంచి 25 మధ్య రూ. 85,790 కోట్ల విలువైన షేర్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ నెలలో ఔట్ ఫ్లో ఏకంగా 10 నెలల గరిష్ఠానికి చేరుకుంది. కాగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లకు తగ్గించడం వల్లే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోడానికి కారణంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.