దిగుబడి మరింత పెంచేందుకు..
ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుంచి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తోంది. ఈ ధరల పెరుగుదల వల్ల 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుంది. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశి మారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వల్ల నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు.