దిశ, ఫీచర్స్ : కొద్ది వారాల క్రితం భర్తకు బహిరంగ విడాకులు ప్రకటించిన దుబాయ్ ప్రిన్సెస్.. తాజాగా ‘Divorce’ పర్ఫ్యూమ్ లాంఛ్ చేసింది. త్వరలో మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మహరా M1 నుంచి రాబోతుందన్నట్లు అనౌన్స్ చేసిన వీడియోలో నల్ల చిరుత పులి, పగిలిన గాజు కనిపించగా.. అంత పవర్ ఫుల్ గా ఉంటుందని సింబాలిక్ గా చెప్పింది అంటున్నారు విశ్లేషకులు.
కాగా దుబాయ్ పాలకుడు బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె యువరాణి షేఖా మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్.. మే 2023లో పారిశ్రామికవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ ను షేఖా మహరా వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత వీరిద్దరికి కుమార్తె జన్మించింది. కానీ భర్త మాజీ భార్యతో బిజీగా ఉంటున్నాడని తెలిసిన యువరాణి.. అదే విషయాన్ని ప్రస్తావిస్తు ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులు ప్రకటించింది.