Telegram Channel
Join Now
2029కి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం నేర్పించారని, బానిసత్వం వద్దు స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించారన్నారు. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దానికి తానే ఛైర్మన్‌గా ఉన్నానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు.