Telegram Channel
Join Now
బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, ఇందిరా నాయక్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, కొత్తగా వెలసిన అంబాపురం పంచాయితీ పరిధిలోని కాలనీలకు వరద ముంచుకొస్తోందనే సమాచారమే ప్రభుత్వం నుంచి చేరలేదు. అజిత్ సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 31వ తేదీ సాయంత్రం వరద రావొచ్చనే హెచ్చరికలు మాత్రమే చెప్పారని, ఇళ్లలోకి వరద వస్తుందనే సమాచారం లేకపోవడంతో సర్వం కోల్పోయామని బాధితులు చెబుతున్నారు.దీంతో కట్టుబట్టలతో మిగిలామని, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెబితే జాగ్రత్త పడేవారిమని బాధితులు వాపోతున్నారు.