Blinkit: కస్టమర్ల కోసం బ్లింకిట్ కొత్త సర్వీస్.. కేవలం 10 నిమిషాల్లోనే రిటర్న్‌, ఎక్స్ఛేంజ్

By Margam

Published on:

Follow Us
Blinkit: కస్టమర్ల కోసం బ్లింకిట్ కొత్త సర్వీస్.. కేవలం 10 నిమిషాల్లోనే రిటర్న్‌, ఎక్స్ఛేంజ్


Telegram Channel Join Now

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్విక్ కామర్స్(Quick Commerce) కంపెనీ బ్లింకిట్(Blinkit) కస్టమర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా ‘ఈజీ రిటర్న్స్(Easy Returns)’ పేరుతో రిటర్న్‌(Return), ఎక్స్ఛేంజ్(Exchange) సదుపాయం తీసుకొచ్చింది. ఈ సేవలను కూడా 10 నిమిషాల్లోనే అందించనున్నట్లు బ్లింకిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ అల్బిందర్‌ దిండ్సా(Albinder Dhindsa) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్(X)’ వేదికగా వెల్లడించారు. దుస్తులు(Clothing), పాదరక్షలు(Footwear) కొనుగోలు చేశాక ఫిట్టింగ్‌ విషయంలో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. సరైన సైజ్ రాకపోయినా, కలర్ నచ్చకపోయినా రిటర్న్‌ చేయాలనుకుంటారు. వారి కోసమే ఈ సదుపాయం తీసుకొచ్చాం. కేవలం 10 నిమిషాల్లోనే రిటర్న్‌, ఎక్సేంజ్‌ ఫెసిలిటీని అందిస్తాం అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కొన్ని వారాలుగా ఈ సదుపాయాన్ని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)లో కంపెనీ పరీక్షించినట్లు ఆయన తెలిపారు. అక్కడ విజయవంతం కావడంతో ముంబై(Mumbai), హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bangalore), పూణే(Pune)లలో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లో ఈ సేవల్ని విస్తరించనున్నామని దిండ్సా పేర్కొన్నారు.



Source link

Leave a Comment