విష్ణుప్రియపై సోనియా ఏడుపు
ఇక ఉదయం విష్ణుప్రియ సరదాగా ప్రేరణను ఆటపట్టించింది. ఆ సమయంలో అక్కడే కూర్చున్న సోనియా వెంటనే లేచివెళ్లిపోబేతే పక్కనే ఉన్న నిఖిల్ ఏమైందంటూ అడిగాడు. అది రెచ్చగొట్టి మాట్లాడుతుంది అంటూ సోనియా అంటే ఏమైందిరా దేనికి హర్ట్ అవుతారో కూడా తెలీదు.. నీకు హర్ట్ అయితే చెప్పేయొచ్చుగా విష్ణుతో అంటూ నిఖిల్ సలహా ఇచ్చాడు. అన్నది నన్ను కాదుగా అంటూ సోనియా అంది. మరి నువ్వెందుకు హర్ట్ అవుతున్నావ్.. తమషాని అలానే తీసుకోవాలి.. అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో సోనియా కోపంగా పక్కకెళ్లి కూర్చొని నిఖిల్‌తో విష్ణు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది.
విష్ణు ఈరోజు కాదు రోజూ అలానే చేస్తుంది.. జోకులకి కూడా ఓ హద్దు ఉంటుంది.. నీదేదే నువ్వు చూసుకో.. నీ రిలేషన్ షిప్ ఏదో నువ్వు చూసుకో.. వేరే వాళ్లవి బొక్కలు పెట్టకూడదు కదా.. నిన్న అలానే మీ టీమ్ వాళ్లే అలా చేస్తున్నారు అంటే ప్రేరణ ఏడ్చింది.. రెచ్చగొట్టడం అనేది విష్ణుప్రియకి బాగా అలవాటు.. అంటూ నోరుపారేసుకుంది సోనియా. ఇక అప్పుడే శేఖర్ బాషా గురించి కూడా సోనియా పేలింది.
స్పిన్ ది బాటిల్ టాస్కు.. నిఖిల్ హైలెట్
తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లను కాస్త ఎంటర్‌టైన్ చేయడానికి స్పిన్ ది బాటిల్ అనే గేమ్ పెట్టాడు. దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్లు ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఇక దీంట్లో ముందుగా యష్మీ బుక్ అయింది. దీంతో బిగ్‌బాస్‌కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి.. ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుండొచ్చు.. అంటూ శేఖర్ బాషా బాగా ఇరికించాడు. దీనికి సిగ్గులేకుండా నవ్వుతూ చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుతో గొడవ పడ్డా అంటూ యష్మీ చెప్పింది. తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చేసరికి పోల్ డ్యాన్స్ చేయాలంటూ మణి డేర్ ఇచ్చాడు. అలానే మిగిలిన వాళ్లు కూడా తమకిచ్చిన డేర్స్ చేశారు. ఇక నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా హైలెట్ అయింది. ఆ ఎక్స్‌ప్రెషన్లు, డ్యాన్స్ అన్నీ భలే సెట్ అయ్యాయి.
ఏడిపించేసిన కంటెస్టెంట్లు
తర్వాత కంటెస్టెంట్లను ఎమోషన్స్‌తో ఏడిపించేశాడు బిగ్‌బాస్. హౌస్‌లోకి వచ్చి రెండు వారాలు గడిచింది.. మీకిష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్‌బాస్‌కి తెలుసు.. వారి జ్ఞాపకాలను మీతో ఉంచుకునే అవకాశం ఉంది.. ఐదుగురు సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఇస్తున్నాం.. ఆ ఐదుగురు ఎవరనేది మీతోటి ఇంటి సభ్యులే నిర్ణయిస్తారు.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత ఇద్దరి ఇద్దరినీ పిలిచి అందులో ఎవరికి గిఫ్ట్ లభించాలో ఎవరిది తిరిగి పంపించాలో మిగిలిన సభ్యులు కారణాలు చెప్పి లాలీ పాప్‌ను వాళ్లకి ఇచ్చి మద్దతు పలకాలి.. లాలీ పాప్‌లు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే ఆ సభ్యుడికి గిఫ్ట్ అందుతుంది అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.
ఇక ముందుగా అభయ్, నిఖిల్ గిఫ్ట్స్ చూపించాడు బిగ్‌బాస్. నిఖిల్‌కి వాళ్ల నాన్న షర్ట్ గిఫ్ట్ రాగా.. అభయ్‌కి వాళ్ల నాన్న వాచ్ తెప్పించాడు బిగ్‌బాస్. ఇక వీటితో తమ జ్ఞాపకాలను ఇద్దరూ పంచుకున్నారు. మా నాన్న జీవతంలో ఒక్కసారే నన్ను హగ్ చేసుకున్నారు.. ఆయన మేథ్స్ టీచర్.. చాలా స్ట్రిక్ట్.. కానీ నేను ఇండస్ట్రీకి రావడానికి బాగా ఎంకరేజ్ చేశారు.. ఇలా ఇండస్ట్రీకి వచ్చి నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అది.. ఉన్నన్ని నాళ్లు అదే పెట్టుకున్నాడు మా నాన్న అంటూ అభయ్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక అది మా నాన్న షర్ట్.. నేను ఊరిలో కాకుండా బయట ఉంటానని.. అది ఎప్పుడూ నాతో ఉంచుకుంటా.. బేసిక్‌గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ ఉండదు.. అందుకే హగ్గు కూడా ఇవ్వలేం.. కానీ ఆయన షర్ట్ దొంగతనం చేశా అది వేసుకుంటే ఆయన్ను హగ్ చేసుకున్నట్లు ఉంటదని.. అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో ఎక్కువ లాలి పాప్‌లు అభయ్‌కి ఇచ్చారు సభ్యులు. దీంతో అభయ్‌కి గిఫ్ట్ దక్కింది. నిఖిల్ గిఫ్ట్ స్టోర్ రూమ్‌కి చేరింది.
లవర్ గురించి చెప్పిన సోనియా
ఇక ఇది జరిగిన తర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది. ఏమైంది నీకు ఓకే కదా బయటంతా అంటూ నిఖిల్ అడిగాడు. అవును.. కానీ ఇక్కడి నుంచి ఇంకేం వస్తాయో తెలీదు.. అంటూ సోనియా అంది. నువ్వుంటే ఏంటో ఆయనకి (లవర్) పూర్తిగా తెలుసు కదా అంటూ నిఖిల్ అడిగాడు. హా నేనేంటో అతనికి కంప్లీట్‌గా తెలుసు.. అదొకటే నమ్మకం అంతే.. అంటూ సోనియా ఏడ్చింది. 100 మంది వంద రకాలుగా మాట్లాడతారని నువ్వే చెప్తావ్ కదా నాన్న.. కానీ నీకే నిజం ఏంటో తెలుసు.. అంటూ నిఖిల్ అన్నాడు. వెంటనే నిఖిల్ ఒడిలో పడుకొని తెగ ఏడ్చింది సోనియా. ఇక నిఖిల్ ఎప్పటిలానే ఓదార్చాడు. మొత్తానికి ఇలా సోనియాకి బయట లవర్ ఉన్నాడని.. ఇక్కడ హౌస్‌లో జరిగేది చూసి ఏమనుకుంటాడోననే భయం అయితే సోనియాలో మొదలైందన్నమాట.
నైనిక లవ్ స్టోరీ
ఇక తర్వాత నైనిక, సీతకి సంబంధించిన గిఫ్ట్‌లు వచ్చాయి. తనకి వచ్చిన బొమ్మ గురించి చెప్పింది సోనియా. “5 ఇయర్స్ ఒక రిలేషన్‌లో ఉన్న తర్వాత తను నన్ను వదిలి వెళ్లిపోయాడు.. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు.. అతను ఇచ్చిన గిఫ్ట్‌యే ఇది.. అది లేకుండా ఏడాదిన్నర నుంచి నిద్ర పోలేదు.. అయితే ఇక్కడికి వచ్చాక నాకు నైనిక, విష్ణు దొరికారు లక్కీగా.. వాళ్లతో మాట్లాడతూ పడుకుంటున్నా.. కనుక ఇది లేకపోయినా ఫర్లేదు.. నైనికకి వచ్చిన గిఫ్ట్ తనకి ఇవ్వడమే నాకు ఇష్టం..” అంటూ సోనియా చెప్పింది.
తర్వాత నైనిక తన లవ్ స్టోరీ చెప్పింది. “ఇక్కడికి వచ్చే 20 డేస్ ముందు కూడా తనకి నాకు చాలా గొడవలు జరిగాయి.. వద్దనుకున్నాం కానీ తను, నేనూ ఇద్దరూ వదల్లేకపోయాం. నా అబ్యూజివ్ రిలేషన్ షిప్ తర్వాత హైదరాబాద్‌లో నేను ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యానంటే అది తన వల్లే.. నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ నువ్వు నన్ను లవ్ చేసినదానికి లవ్ యూ సో మచ్ కన్నా..” అంటూ నైనిక ఎమోషనల్ అయింది. దీంతో నైనికకి గిఫ్ట్ ఇచ్చి సీత బహుమతి స్టోర్ రూమ్‌లో పెట్టేశారు.
నాన్నకు ప్రేమతో నబీల్, పృథ్వీ
తర్వాత నబీల్, పృథ్వీ ఇద్దరకీ వాళ్ల ఇంట్లో నుంచి రెండు ఫొటో ఫ్రేమ్స్ వచ్చాయి. “ఇది మా డాడీ నన్నుచిన్నప్పుడు ఎత్తుకున్న ఒకే ఒక్క ఫొటో ఇది.. లైఫ్ మొత్తంలో 30 డేస్ స్పెండ్ చేసి ఉంటానేమో డాడీతో అంతే.. ఎందుకంటే ఆయనకి కొంచెం ఏంగర్ (కోపం) ఇష్యూ.. అక్కడి నుంచే వచ్చింది నాకు కూడా.. ఆగస్టు 15న నబీల్ డాడీ పుట్టిన రోజు అయితే అది మా డాడీ చనిపోయిన రోజు. అప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు నాకు.. కానీ ఆయనకి నేను యాక్టర్ అవ్వాలని కోరిక.. అయ్యాను.. బట్ ఆ ఫొటో నాకు వద్దు.. ఆయనెప్పుడు నా వెనుకే ఉంటాడనుకుంటున్నా.. కనుక నబీల్‌కి ఇవ్వండి” అంటూ పృథ్వీ చెప్పాడు.
ఇక తన నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫొటో ఇది అంటూ నబీల్ తన స్టోరీ చెప్పాడు. కరోనా సమయంలో నాన్న చనిపోయారు.. అప్పుడు తీసుకున్న ఫొటో ఇది అంటూ నబీల్ చెప్పాడు. ఇక సభ్యులంతా నిఖిల్‌కి లాలిపాప్ ఇవ్వడంతో గిఫ్ట్ అందుకున్నాడు.
సూసైడ్ చేసుకోవాలనుకున్నా కానీ
ఇక చివరిగా మణికంఠకి అమ్మమ్మ శాలువా.. ఆదిత్యకి వాళ్ల నాన్న ఫొటో గిఫ్ట్‌గా వచ్చింది. అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ల అమ్మ స్వెటర్ ఉండటంతో అంతా ఆదిత్యకి లాలిపాప్స్ ఇచ్చారు. ఇక తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు. “నాలో ఒక్క సింగిల్ గుడ్ క్వాలిటీ ఉన్నా అది ఆయన వల్లే.. బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నేనే నేర్చుకున్నా.. ఒక రోజు ఇంట్లో ఉండగా భార్యకి, అమ్మకి, అబ్బాయికి కొవిడ్ వచ్చింది .. అప్పుడు నాకు సూసైడల్ థాట్స్ వచ్చాయి.. అప్పుడు మా నాన్న ఫొటో కింద పడింది.. అది చూశాక మళ్లీ నాకు బతకాలనే కోరిక వచ్చింది..” అంటూ ఆదిత్య చెప్పాడు.
ఇక హౌస్ నుంచి బయటికి వెళ్లాక మణితో పాటు మీ అందరికీ మా అబ్బాయి ఫొటో చూపిస్తా.. అప్పుడు మణితో ఎందుకంత బాండింగ్ అయింది నాకు అన్నది తెలుస్తుంది. అంటూ ఆదిత్య అన్నాడు. ఇక ఎపిసోడ్ చివరిలో శేఖర్ బాషా కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. మనందరికీ నాన్న అంటే ఇష్టం.. కానీ నాన్నకి మనమంటే ఎంత ఇష్టం అనేది మనం నాన్న అయితే కానీ తెలీదు.. అంటూ శేఖర్ అన్నాడు.