Bigg Boss 8 Telugu Day 09: నైస్‌గా నిఖిల్‌కి గొయ్యి తవ్వేసిన సోనియా.. పాప బుట్టలో మరో బకరా.. అప్పుడే 4 వికెట్లు డౌన్

By Margam

Published on:

Follow Us
Bigg Boss 8 Telugu Day 09: నైస్‌గా నిఖిల్‌కి గొయ్యి తవ్వేసిన సోనియా.. పాప బుట్టలో మరో బకరా.. అప్పుడే 4 వికెట్లు డౌన్


Telegram Channel Join Now
బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. అయితే నామినేషన్లలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. అయితే పెద్ద క్లేన్‌కి చీఫ్ కావడంతో యష్మీకి ఓ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ద్వారా నామినేషన్లలో ఉన్న ఒక సభ్యుడ్ని సేఫ్ చేయొచ్చు.. అలానే లేని వాళ్లని ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలి.

ప్రేరణకి ఓటు.. విష్ణుకి పోటు

ఇక బిగ్‌బాస్ ఇలా పవర్ గురించి చెప్పిన అరక్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మీ. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్‌గా యష్మీ చెప్పిన విషయం వింటే బుర్రతిరిగిపోద్ది. వాళ్లు లక్సరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగా ఎంజాయ్ చేయలేరట.. గేమ్‌పై కాన్సట్రేషన్ చేయలేరట.. ఈ కారణం చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మీ. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే?

  1. మణికంఠ
  2. పృథ్వీ
  3. ఆదిత్య
  4. నిఖిల్
  5. సీత
  6. శేఖర్ బాషా
  7. నైనిక
  8. విష్ణుప్రియ

నిఖిల్‌కి సోనియా ఝలక్

ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నిఖిల్ గురించి పృథ్వీతో మాట్లాడుతూ గట్టిగానే స్కెచ్ వేసింది సోనియా. నామినేషన్లలో ఎవరూ లేక పృథ్వీని నామినేట్ చేశాడు నిఖిల్. దీనికి రీజన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంతో పృథ్వీ కాస్త హర్ట్ అయ్యాడు. ఇదే విషయం గురించి పృథ్వీతో మాట్లాడుతూ నిఖిల్‌కి గోతులు తవ్వింది సోనియా. “వాడికసలు పాయింట్స్ లేవురా.. అందుకే అభయ్, నబీల్‌ను నామినేట్ చేద్దామనుకున్నాడు. కానీ అభయ్‌ని అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆదిత్య నామినేట్ చేశాడు కదా నువ్వు అయితే అర్థం చేసుకుంటావని నీకు వేసిండు..” అంటూ నిఖిల్ తరఫున పృథ్వీతో సోనియా మాట్లాడింది. దీనికి వాడు అంత వీక్ ఎందుకున్నాడు.. అంటూ పృథ్వీ అడిగాడు.

“అవును ఇంకొక ఒన్ వీక్ చూద్దాం వాడిని.. డెవలప్ అయితే ఓకే లేకపోతే లైట్ తీసుకోవడమే ఇంకేం చేస్తాం.. ఎమన్నా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుందాం..” అంటూ సోనియా అంది. అలానే నామినేషన్ గురించి టెన్షన్ పడకు మనకంటే మందు పోవాల్సిన వాళ్లు చాలా మందే ఉన్నారు.. వాళ్లు పోయేంత వరకూ మనం సేఫే.. అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగులు కొట్టింది.

మరో వికెట్ ఔట్

ఇక తర్వాత సోనియా ఖాతాలో మరో వికెట్ కూడా పడిపోయింది. పొద్దుపొద్దున్నే మణికంఠతో మాట్లాడుతూ “ఎవడన్నా నన్ను రెచ్చగొడితే నేను ఎలా తీసుకుంటాను.. ఎలా రియాక్ట్ అవుతాను అనేది చూపించడానికే విష్ణుప్రియతో అలా మాట్లాడా.. అలా ఉంటేనే రెండోసారి మన జోలికి రారు. ఇక్కడ నేను ఫ్యామిలీ అందరినీ మిస్ అయ్యే కదా వచ్చా. నాకు కూడా హౌస్‌లో ఒక అన్న కావాలి.. ఒక తమ్ముడు కావాలి.. ” అంటూ సోనియా అంది. ఇక దీనికి మణికంఠ ఎందుకు ఎమోషనల్ అయ్యాడో అర్థం కాలేదు కానీ వెంటనే ఓ డైలాగ్ వేశాడు. “నీకు విష్ణుప్రియకి డిస్కషన్ వస్తున్నప్పుడు నేను జడ్జ్ చేయలేకపోయా ఎందుకంటే నాకు నీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. అక్క అంటే నువ్వు ఒక్క దానివే నాకు.. సరేనా.. నాకు ఎక్కడైనా నెగెటివ్ ఆలోచన వచ్చిందంటే క్లియర్ చేసుకోవడం నా హ్యాబిట్ అంతే..” అంటూ సోనియాతో అనగానే పాప వెంటనే మణికంఠకి ఓ హగ్ ఇచ్చింది.

ఆ తర్వాత ఉదయం కాఫీ కప్పు పట్టుకొని పృథ్వీ దగ్గరికెళ్లింది సోనియా. “మాట్లాడిండా వాడు (నిఖిల్) నీతో.. అదే పెద్దోడు.. వాడు పెద్దోడు.. నువ్వు చిన్నోడు..” అంటూ పులిహోర కలిపింది సోనియా. ఆ మాట్లాడాడు.. ఫ్లిప్ అయ్యా బ్రో.. పాయింట్సే దొరకడం లేదు ఆ టైమ్‌లో అందుకే నీకు వేశా నామినేషన్.. సారీ అని చెప్పాడు..” అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా ఇప్పటికే హౌస్‌లో నెమ్మదిగా ఒక్కొక్కడినీ తన వైపు తిప్పేసుకుంటుంది సోనియా. నిజానికి మొదటివారం హౌస్‌లో నిఖిల్-సోనియాకి నువ్వా-నేనా అన్నట్లు డిస్కషన్ నడించింది. ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ నిఖిల్ ఆటే కాదు మాట కూడా మొత్తం మారిపోయింది. ఇక పృథ్వీ, అభయ్ కూడా ఇప్పటికే సోనియాకి జిగిరీ అయిపోయారు. తాజాగా మణికంఠ బాబు కూడా అందులో చేరాడు. ఇలా తనకంటూ ఓ టీమ్‌ను గట్టిగా తయారు చేస్తుంది ఆర్జీవీ పాప.

Source link

Leave a Comment