Best Companies of 2024: టైమ్‌ మ్యాగజైన్ అత్యుత్తమ కంపెనీల లిస్ట్‌లో 22 భారత కంపెనీలు

By Margam

Published on:

Follow Us
Best Companies of 2024: టైమ్‌ మ్యాగజైన్ అత్యుత్తమ కంపెనీల లిస్ట్‌లో 22 భారత కంపెనీలు


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పలు భారత కంపెనీలు సైతం స్థానం సంపాదించాయి. ‘టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024’ పేరిట విడుదల చేసిన దీనిలో 1000 కంపెనీలు ఉన్నాయి. వీటిలో 22 భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దేశం నుంచి ప్రముఖ టెక్ కంపెనీ HCLTech జాబితాలో 112 స్థానం సంపాదించుకుని భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ 119, విప్రో 134, మహీంద్రా గ్రూప్ 187, లార్సెన్ & టూబ్రో 549, ITC లిమిటెడ్ 586 వద్ద ఉన్నాయి.

ఈ జాబితాలో అనేక బ్యాంకింగ్ సంస్థలు కూడా మంచి ర్యాంక్‌ను పొందాయి. ఈ విభాగంలో యాక్సిస్ బ్యాంక్ 504 తో అగ్ర స్థానంలో నిలవగా, 518 తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాతి స్థానంలో, 525 ర్యాంక్‌‌తో మూడవ ప్లేస్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, నాలుగో స్థానంలో 525 ర్యాంక్‌‌తో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ 736 వ స్థానంలో ఉండగా, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టైమ్ మ్యాగజైన్ జాబితాలో 646 వ స్థానంలో నిలిచింది.

జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టాప్ 10 అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంపెనీలు వరుసగా 1. యాపిల్, 2. యాక్సెంచర్, 3. మైక్రోసాఫ్ట్, 4. BMW గ్రూప్, 5. అమెజాన్, 6. ఎలక్ట్రిసిట్ డి ఫ్రాన్స్,7. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, 8. మెటా ప్లాట్‌ఫారమ్‌లు, 9. సిమెన్స్, 10. JP మోర్గాన్‌చేజ్.

ఇండియా నుంచి జాబితాలో స్థానం పొందిన కంపెనీలు.. HCLTech(112), ఇన్ఫోసిస్ (119), విప్రో (134), మహీంద్రా గ్రూప్‌ (187), యాక్సిస్‌ బ్యాంక్‌ (504), స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (518), ఐసీఐసీఐ బ్యాంక్‌ (525), ఎల్‌అండ్‌టీ (549), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (551), ITC (586), హీరో మోటోకార్ప్‌ (597), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (646), మథర్‌సన్‌ గ్రూప్‌ (697), అదానీ గ్రూప్‌ (736), NTPC లిమిటెడ్‌ (752), యెస్‌ బ్యాంక్‌ (783), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (850), గోద్రెజ్‌ (921), బజాజ్‌ గ్రూప్‌ (952), సిప్లా (957), BEL (987), MRF (993)

ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల 2024 జాబితాను మూడు కోణాల్లో సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించారు. దాదాపు 1,70,000 మందితో 50కి పైగా దేశాల్లో ఉద్యోగుల సంతృప్తి, సిఫార్సులు, పని పరిస్థితులు, జీతం, సమానత్వం, మొత్తం కంపెనీ ఇమేజ్ వంటి అంశాలపై నిర్వహించిన సర్వేల ద్వారా ఈ డేటాను తయారు చేశారు. 2021 నుండి 2023 వరకు $100 మిలియన్లకు మించిన ఆదాయాలు, వృద్ధిని, స్థిరత్వం ప్రదర్శించిన కంపెనీలను పరిగణలోకి తీసుకున్నారు.



Source link

Leave a Comment