Telegram Channel
Join Now
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా.. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లాయర్ గవాస్కర్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే.. వైసీపీ నేతలు విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా.. తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శి,స్తున్నారని తెలుస్తోంది. దీంతో విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.