AP Universities: ఏపీలోని యూనివర్సిటీల్లో అధ్యాపకులు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా నోటిఫికేషన్ లు ఇవ్వాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా…వీటిలో పరిధిలో 2061 కాలేజీలు, 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అనేక సమస్యలతో ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రమాణాలు పడిపోయాయని సిఎం అన్నారు. వీటిని సరిదిద్ది యూనివర్సీటీలు నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయి ర్యాంకింగ్ సాధించేలా ప్రణాళికలు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు.