Telegram Channel
Join Now
రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి బదిలీలకు కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రారంభించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ (జీవీడబ్ల్యూవీ) & గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (వీఎస్‌డబ్ల్యూఎస్) డిపార్ట్‌మెంట్‌తో సహా కొన్ని విభాగాల ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం ఆగస్టు19 నుంచి ఆగస్టు 31 వరకు నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు, సూచనలను జారీ చేసింది.