వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఈ నెల 27న విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐటిఐ ఫిట్టర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలకు హాజరుకావాలని తెలియజేశారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు గల నిరుద్యోగులు అర్హత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. విశాఖలో జరిగే జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలకు 9948768778 నంబర్ ని సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://employment.ap.gov.in/ వెబ్ సైట్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.