అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన కమతం హనుమంత రెడ్డి (70), కమతం రంగమ్మ (65) దంపతులకు ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు అయిపోయాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అనంతపురంలో చిన్మయనగర్‌లో నివాసం ఉంటున్న కుమార్తెలను చూసేందుకు ప్రతివారం హనుమంత రెడ్డి, రంగమ్మ వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలోనే ఆదివారం వారి కుమార్తెలను చూడడానికి అనంతపురంలో చిన్మయనగర్ వెళ్లారు. కుమార్తెలు, మనవళ్లతో సంతోషంగా గడిపి తిరిగి సోమవారం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు.