గ్రేటర్​ వరంగల్ పై డేగ కన్ను..!

By Margam

Published on:

Follow Us
గ్రేటర్​ వరంగల్ పై డేగ కన్ను..!


Telegram Channel Join Now

  • మూడు నెలల్లో  ఇంటిగ్రేటెడ్ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍
  • ట్రైసిటీ అంతట 500 హైటెక్‍ సీసీ కెమెరాలు
  • స్మార్ట్​సిటీ పథకంలో  రూ.100 కోట్లతో పనులు

వరంగల్, వెలుగు:  గ్రేటర్‍ వరంగల్‍పై ప్రభుత్వం డేగ కన్ను పెట్టనుంది. హైదరాబాద్​తరహాలో ఇంటిగ్రేటెడ్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ (ఐసీసీసీ) ఏర్పాటు చేయనున్నది. స్మార్ట్​సిటీ పథకంలో రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్ట్​చేపట్టారు. ట్రైసిటీ అంతట ప్రధాన జంక్షన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చి, కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా గ్రేటర్‍ సిటీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం తెలుసుకోవచ్చు.

16 శాఖల సమన్వయంతో.. 

గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ మెయిన్‍ ఆఫీస్‍ కేంద్రంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍లో దాదాపు 16 ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయనున్నాయి. స్మార్ట్​సిటీ టీం, పోలీస్‍, రెవెన్యూ, హెల్త్, ఫైర్‍ వంటి ప్రధాన డిపార్టుమెంట్లు ఇందులో పనిచేయనున్నాయి. ఆయా శాఖల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఐసీసీసీలో చురుగ్గా పనిచేస్తున్న ప్రొఫెషనల్స్​ను గ్రేటర్‍ వరంగల్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍కు తీసుకురానున్నారు. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట పరిధిలోని గ్రేటర్‍ పరిధిలో మొత్తంగా 500 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం ఏర్పాటు చేయగా, 10 శాతం జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, 8 చోట్ల పనులు పూర్తయ్యాయి.

వరదల ఎఫెక్ట్​తెలిసేలా..

సిటీ జనాలకు కార్పొరేషన్‍ తరఫున తాగునీరు, చెత్త సేకరణ వంటి సేవలు అందించే క్రమంలో బల్దియా తరఫున రాంపూర్‍ డంపింగ్‍ యార్డ్, ఉర్సు గుట్ట, భద్రకాళీ బండ్‍, వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు ప్రాంతాల్లో 75 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా తాగునీటి సరఫరాతోపాటు వర్షాకాలంలో చెరువుల్లో నీటిమట్టం తెలుసుకోవడం, కట్టల పరిస్థితులను చూసి, అలర్ట్​కానున్నారు. సాలిడ్‍ వేస్ట్​మేనేజ్‍మెంట్‍లో భాగంగా సిటీలో చెత్త సేకరిస్తున్న 360 స్వచ్ఛ భారత్‍ వాహనాలకు జీపీఎస్‍ ట్రాకింగ్‍ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. చెత్త సేకరణలో మరింత సేవలు అందించేలా వేరియబుల్‍ మేజర్స్ డిస్ల్పేబుల్‍ (వీఎండీ) కింద 5 ప్రాంతాలు గుర్తించారు. ఇందులో వెహికల్స్​ తిరుగుతున్నాయో తెలుసుకోనున్నారు. పనులను గ్రేటర్‍ కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే పర్యవేక్షిస్తున్నారు. 

దొంగలకు, ట్రాఫిక్‍ రూల్స్​ బ్రేక్స్ కు చెక్..​

సిటీలో ఏర్పాటు చేసే 500 కెమెరాల్లో పోలీస్‍ శాఖ సూచించిన జంక్షన్లు, ట్రాఫిక్‍ ప్రాంతాలు, క్రైం జరిగే స్పాట్లు వంటి ఏరియాల్లో 200 కెమెరాలు బిగిస్తున్నారు. నగరంలో ఎక్కడ దొంగతనాలు, గొడవలు, అల్లర్లు వంటివి జరిగినా క్షణాల్లో తెలుసునేలా కమాండ్‍ సెంటర్‍ పనిచేయనుంది. చోరీలు, రోడ్డు యాక్సిడెంట్లు జరిగే సమయాల్లో నేరస్తుల కదలికలు వెంటనే గుర్తించేలా కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ బృందాలు పనిచేయనున్నాయి. సిటీలో ట్రాఫిక్‍ సమస్యలకు చెక్‍ పెట్టేలా, ట్రాఫిక్‍ రూల్స్​బ్రేక్‍ చేసే వారిపై చర్యలు తీసుకునేలా సీసీ కెమెరాలు పని చేయనున్నాయి.  

మూడు నెలల్లో ప్రారంభించేలా చర్యలు..

వరంగల్లో స్మార్ట్​సిటీ పథకంలో రూ.100 కోట్లతో ఇంటిగ్రెటేడ్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ ప్రాజెక్ట్​చివరికి వచ్చింది. గ్రేటర్‍ కార్పొరేషన్‍ ఆఫీసు వద్ద సెంటర్‍ నిర్వహణ పనులు నడుస్తున్నాయి. నగరంలో 500 కెమెరాల ఏర్పాటు పనుల్లో 80 శాతం పూర్తయ్యాయి. ఇంకొన్ని టెక్నికల్‍, ట్రైనింగ్‍ పనులు పూర్తి చేయడం ద్వారా రాబోయే 3 నెలల్లో దీనిని ప్రారంభించేలా చూస్తున్నాం.      

ప్రవీణ్‍ చంద్ర (ఎస్‍ఈ, స్మార్ట్​సిటీ స్కీం)

 



Source link

Leave a Comment