Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

By Margam

Published on:

Follow Us
Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?


Telegram Channel Join Now
Gold Rate Today: ఈనెల ఆరంభం నుంచి బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు వెనకడుగు వేశారు. అయితే, అలాంటి వారందరికీ ఇదే మంచి అవకాశం. రికార్డ్ గరిష్ఠాల నుంచి బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ పసిడి రేట్లు దిగివచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి గిరాకీ తగ్గడంతో ధరలు దిగివస్తున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లలో పడుతోంది. అయితే, ప్రస్తుతం పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా ధరలు మళ్లీ పెరగొచ్చని, ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ సెప్టెంబర్ 20, 2024 రోజున ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు..

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. గత వారం వరుసగా పెరిగిన పసడి రేట్లు గత మూడు రోజులుగా భారీగానే దిగివచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2588 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.83 డాలర్ల వద్ద ఉంది. అలాగే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రూ.83.633 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. గత రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.300 తగ్గగా ఇవాళ మరో రూ.250 మేర పడిపోయింది. దీంతో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు తులంపై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములపై రూ.250 తగ్గడంతో రూ.68 వేల 400 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులంపై రూ.280 తగ్గి రూ.74 వేల 600 వద్దకు పడిపోయింది.

స్థిరంగా వెండి రేట్లు..

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గగా.. వెండి రేట్లు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 96 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.91 వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లలో ఏ పన్నులు లేవు. ప్రాంతాలను బట్టి ట్యాక్సులు వేరుగా ఉంటాయి. దీంతో ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి.

Source link

Leave a Comment